Saturday 5 January 2013

maamma .. a tribute to my grand mom

నేను వేసే ప్రతీ అడుగు -
   అడిగే ప్రశ్న .. .. ఈ అడుగులు వేయించిన మనిషి ఏది అని .?
నా  కనురెప్ప ఫై  వాలే ప్రతీ కిరణం
    వెతికే ముఖం .. నీ కళ్ళకి  కాటుక పెట్టిన ఆఅ ముఖం ఎక్కడ అనీ .?
అలసట తెలియని నా బాల్యం 
అడుగుత్న్న ఈ ప్రశ్న  ..
      నీ చిన్న పాదాలను ముద్దాడి,
     నీకు గోరు ముద్దలు తిన్పించి,
    చందమామ కధలు చెప్పి ,
     నీతో కలిసి ఆటలాడి ,
     నీ కోసం తను ఓడి ,
     నీ గెలుపు లోని ఆనందం లో తన గెలుపుని వెత్తుకుంటూ,
      పిచ్చిదానిలా ఒక వెర్రి ప్రెమని  పంచి
      నీకు మాటలు నేర్పించి ..,
       నువ్వు చెప్పే ప్రతీ మాటకు మురిసిపోయి, 
      నీ ఆనందం లో తన సంతృప్తిని వెతుక్క్కుని,
      నీ కోసం తన జీవితం ధారపోసి,
     నీ గతాన్ని ఒక చెరిగిపోని మధురానుభూతి గా మార్చిన,
      ప్రేమ అన్న పదానికి తోలి అర్ధాని ఇచ్చిన ,

ఆఅ ముసలి మనిషి
       ""మామ్మ"" ఏది అని ???

నువ్వు మాకు ఇచ్చిన ప్రేమానురాగాలు కన్నా  
నేడు నువ్వు మా మధ్య లేవు అన్న బాధని దిగామింగడం  అసాధ్యం
నువ్వు మిగిల్చినా ఈ జ్ఞాపకాల్ని
నిరంతరం గుర్తుచెసుకున్తూ నీ....
                                                రాజు (మా "మా అమ్మ " కి నేను ఎప్పుడు రాజునే )
 .........................................................................................................సిద్ధార్థ చొక్కాకుల 

No comments:

Post a Comment