Sunday 25 December 2016

raani manishiki karagani manasuki o lekha

"జన్మంతా నీ అడుగుల్లో వేసే వీలుంటే ఆ నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా "

అని రాసిన సిరివెన్నెల పాట లా 

నీవు అడుగులు వేసే నేల నేనౌతూ 
నీ చిరునవ్వుల కారణం నేనౌతూ 
నీ ఆనందానికి ఆధారం నేనై 

"ఓ పాపా లాలి" అని నేను కట్టిన ప్రపంచం లో 
నువ్వు రాణి గా ఉండే మన సామ్రాజ్యం లో 
నిన్ను నిద్రపుచ్చి నీ గుమ్మం బయట నిన్ను ఎల్లప్పుడూ 
కాపాడే రక్షకుడి గా ఉండాలని ఆశించి 

నా అను జీవితానికి మనం అనే అర్ధాన్ని అనుకున్నా 

కానీ పరమార్ధం అని దైవనిర్ణయపు బానిసనై 
అనర్ధాల అడ్డుగోడల మధ్య కొట్టుమిట్టాడుతూ 
నీకు నన్ను దూరం చేసిన ఆ విధిని చూసి వేధిస్తూ 
అంధకారపు అంచుల్లో ఒంటరినై నే కృషించగా 
నీవు రావు అన్న బాధ నన్ను దహించు వేళా 
నీ ఆనందమే నాకు ముఖ్యం అని 
ఆ బాధని దిగమ్రింగే నా ప్రయత్నం 
చేస్తే నన్ను మృగం దిక్కు తోచక 
నొప్పి దాగక బ్రహ్మరాత ను మార్చలేక 
క్షణక్షణం నరకవేదనై నన్ను అంతంతమాత్రం గా 
కొరికేస్తున్నా 

కన్నీరు ఆగక కూడా నీ ఆనందమే నాకు చాలు 
అంటూ నరకాన్ని సైతం నవ్వుతూ నడిపిస్తున్నా 

నేను వేచి ఉంటా నీ రాకకై 
 ఎందుకంటే 
నేను నిన్ను ప్రేమించటం కన్నా 
నీ పై నాకు ఉన్న అభిమానం అధికం 
అదే నిజం 

ఇట్లు 
ఓ బాటసారి 

Friday 8 July 2016

joe

పెదవే కదలనీ చిరునవ్వొచ్చెనే 
యెదకే తెలిసేనే చెలి అది నీ వల్లనే 

నది లా పొంగె నా మది లొ ప్రేమనే 
ఎగిసే సంద్రమై సఖి నీలో కలిసెనే 

నీ శ్వాసే చిరుగాలై 
నీ చూపే చిరుజల్లై 
తనువంతా తడపగా ఓఓఓ 

పువ్వల్లే నే మారి 
నీ ముందే రాలానే 
కురులల్లో బంధీనై ఓఓఓ 


.

.
.

చేతుల్లో చేయ్యే వేసి నడిచేద్దామిలా 
ఆ నింగే నేలను కలిసే దూరం వరకిలా 

మెరిసే ఆ మెరుపులు కాస్తా హరివిల్లవ్వవా 
రాలే ఆ చినుకులు నీ చెంపను తడపగా 

నీలి కళ్ళల్లోనా , కళలే కలలై ఉన్నా 
నా నీ ఇల లో నే నిజమై చూపనా 

నడిచిన నెలే సాక్షిగా 
నీతో జీవితమంతా 
తోడుంటా నీడలా 

నా ఈడు గా నువు నా జోడుగా 
కవికే కవితలా కాలంతో కదులుదాం 

క్షణమూ క్షణమూ నూ కలిపేస్తూ అలా 
యుగమే గడిచెలా నా సృష్టి నే ఎలవా