Saturday 24 December 2011

బ్రతకడం అంటే
గెలుపు కోసం పోరాటం కాదు
పోరాటం లో గెలవటం ,
మనిషి జీవితాన్ని మర్చిపోయినా నష్టం లేదు కాని
జీవన వైఖరిని మర్చిపోతే మాత్రం కష్టం 

Friday 16 December 2011

ఓ చెలియా సఖియా నా ప్రియ నేస్తమా..
నా ప్రేమే నీ మనసుకి గాయమా ,
నా నీడే నీ తనువుకి నరకమా 
నేనంటే నీకంత ద్వేషమా ....................

నీవడిగితే ఇస్తా నా ప్రాణమే
ఎప్పుడో అర్పించా సర్వస్వమే
నా హృదయంలో నీ రూపమే 
నిలిపానే నా ప్రేమ కు గుర్తుగా 
నిన్ను చూడక ముందో రాయినే
నీ స్పర్సతో అయ్యా మనిషినే
నువ్వు లేక నేను ఉండలేనులే
నువ్వు నా జీవితంలో సగ భాగమే 




నన్ను వదిలి వెళ్లాకే నా ప్రాణమా
ఓ చెలియా సఖియా నా ప్రాణమా 
నన్ను వదిలి వెళ్లాకే నా ప్రాణమా .............................................కబీర్ 

Thursday 15 December 2011

naa pranama ...............song(my own lyrics)

నా ప్రాణం నువ్వే
     నా నేస్తం నువ్వే
నా లోకం నువ్వే , నువ్వే..........
 సర్వస్వం నీకే,
జీవితమంతా నీకే ,
నీ బానిస నేనైపోయానే ,
     నాకై పుట్టావనుకున్నా, నాతొ ఉంటావనుకున్నా , జతపడిపోయావనుకున్నా ఓ చెలియా
జీవితానికి ఒక అర్ధం తెలిపి
హృదయ కీర్తనలు విన్పించి
 ప్రేమసాగరం లో తోసేసావే 
ఈ ప్రేమయాత్ర లో సంతోషముగా
  సంచరిస్తున్నాఈ సమయంలో
 నన్ను వదిలి వెళ్ళిపోయావా 
ఈ జీవితాన్ని ఒంటరిగా మార్చేసావ,
 నీ జ్ఞాపకాలని నాకు మిగిల్చివేసావా
, నన్ను వదిలి వెళ్లాకే నా ప్రాణమా
ఓ నన్ను వదిలి వెళ్లాకే  నా ప్రాణమా..................................కబీర్ 

Tuesday 13 December 2011

మదిలోని మొలిచిన చిన్నఆవేదన కోసం
అర్ధం లేని ఆవేశం తో రెచ్చిపోయి
తిరిగి అంతులేని ఆయాసం తో పశ్చాతాపం పడటం
మన మనుషుల సహజ లక్షణం .....................................కబీర్ 

sneham

తుమ్మెద వాలిని పుష్పం
రూపం లేని శిల్పం
రాగం లేని తాళం
దేనికి ఉపయోగం
అలాగే
నీ స్నేహం లేని ఈ జీవితం కూడా వ్యర్ధం ..................................కబీర్ 
అందరితో ఉండు
అందరితో బ్రతుకు
అందరికోసం జీవించు
కొందరి మనసులోనైన నిలిచి ఉంటావు ....................................కబీర్    

neti swatantram

నాటి విప్లవకారులై నేటి ప్రగతికి కర్తలై,
మా కోసం ప్రాణం ఇచ్చిన  మా మనసున నిలిచిపోయిన ,

అమరవీరులకే అంకితం నేటి స్వతంత్రం ,
ఆ ధీరులకే అంకితం నేటి స్వతంత్రం ,

 రెండు వందల ఏళ్ళ తరబడి బానిసత్వం లోనలిగిన ,
భారతమాతకు స్వేచ్చనిచిన  జాతికంతటికి వేలుగునిచిన ,

అపర సుర్యులకే అంకితం నేటి స్వతంత్రం,
ఆ వీరులకే అంకితం నేటి స్వతంత్రం

ఆయుధాలకు లోన్గిపోక అవమానాలకు క్రున్గిపోకా ,
దొంగదేబ్బకు ఎదురుదేబ్బై తెల్లవారిని వేల్లగోట్టిన

ఆ  అమరవీరులకే అంకితం నేటి స్వతంత్రం
ఆ వీరులకే అంకితం నేటి స్వతంత్రం..................................సిద్ధార్థ చొక్కాకుల   
పువ్వై  వికసించిన  నా  హృదయాన్ని ,
తుమ్మేడై  దోచుకుంది  ఒక  మనసు ,
ఆ  మనసుకై  వేచి  ఉన్న  ఈ  జీవితానికి ,
ఉరట ని ఇచ్చే ఒకే ఒక్క ఆశ నా  ప్రేమ ......................సిద్ధార్థ చొక్కాకుల 
జీవన పయనం ఒక  రణం  
దానికి తోడైన  నీ  స్నేహం  ఒక  వరం 
నీ  ప్రేమను  కోరుతుంది  నా  హృదయం 
వేచి  ఉంటాను  జీవితాంతం 
అదే  ఆశగా  బ్రతుకుతుంది  నా  ప్రాణం 
ఓ  చెలి ........................
నువ్వు  లేని  ఈ   జీవితం
ప్రాణం  లేని  ఒక  రాతి  శిల్పం ........................సిద్ధార్థ . చొక్కాకుల 
ప్రేమించడానికి ప్రాణం చాలు 
కాని ప్రేమని గెలవడానికి ప్రలయమైనా సరిపోదు     

prema

ప్రేమ
రెండు అక్షరాల చిన్న పదం
యువతరానికి ఒక  ఆయుధం
    ఒక తాజ్ మహల్ ని కట్టించగల అద్భుతం
    ఒక ఆసిడ్ పోయిన్చగల దారుణం
రెండు హృదయాలను కలిపే స్వర్గం
రెండు కుటుంబాలను విడదీసే నరకం
ఓ ప్రేమ ,
మనిషి జీవితానికి నీ పరిచయం
సుఖదుఖాల కలయుకైన ఓ సాగరం