Sunday 27 January 2013

చాలా  సిగ్గుగా ఉంది 
అంత కంటే ఎక్కువ బాధ గా ఉంది 
ఈరోజు "నేను" అన్న పదానికి నేను అర్ధం కోల్పోయాను 
ఈ మాయ ప్రపంచపు ముసుగు లో పడి నా అనుకున్న ప్రపంచానికి తీరని ద్రోహం చేసాను 
నాకోసం బ్రతికిన వ్యక్తికి ఒక పిడికెడు అన్నం కుడా పెట్టలేక పోయాను
కవిత రాసి మరీ కాటికి చేర్చాను 
నీవు లేని లోటు తీరలేనిది ..... అని చెప్పడానికి కుడా నాకు అర్హత లేని పరిస్థితి 
నీ కోసం నేను చేసింది ఏమైనా  ఉంది అంటే అది నిన్ను కడవరుకు నా భుజాలు మీద  మోయడమే 
ఈ దౌర్బాగ్యుడికి  నీ ఋణం తీర్చుకునే అవకాసం లేకుండా పోయినందుకు ..
  మొదటి సారి ఆ దేవుడి మీద కోపం వచ్చింది ..
   కలం మీద కక్ష చూపలేక
  కళ్ళముందు  ఉన్న నిన్ను కలలో కూడా మరువలేక
చేత కాని వాడిలా
నాకు నేను రాసుకుంటున్న బాధ ఇది ...
                                                             సిద్ధార్థ చొక్కాకుల 

No comments:

Post a Comment