నింగిని నేలకు కలిపే మెరుపులం
వెలుతురు కన్నా వేగం ,
మా ఆశల ఊహల పయనం
ఆ సంద్రం కన్నా లోతైనది,
ప్రేమతో నిండిన మా మది
ఆ అలల సవ్వడి లా,
ఆ కోయిల గానం లా ,
వికసించే పుష్పం లా ,
విహరించే పక్షి లా ,
నిత్యం ప్రతినిత్యం,
ఉరకలు వేసే మా యవ్వనం
కవచం వదిలిన కర్ణులం ,
రాజ్యం వదిలిన రామచంద్రులం ,
వారధి కట్టిన వానరులం ,
మేం లంకను కాల్చిన పవనపుత్రులం ,
కోపంలో మేం పరశురాములం,
గాంభీర్యం లో దుర్యోధనులం
భూమిని సైతం హలముతో చీల్చే బలరాములం మేము కాదా ?
కొండను సైతం చిటికినవేలితో గాలికి లేపిన ఆ కృష్ణావతారం మది కాదా ?
ఆకాశానికి నిచ్చెన వేసిన ఆ అర్జునులం మేమే
ఐరవతమును నెలకు తెచ్చిన ఆ భీముని బలమూ మాది కాదా ?
ఆ కాలయముడు నే తిప్పికొట్టినా మర్ఖండేయులం మేమే కాదా ?
ఆ మహాబలుడనే నెలకు తొక్కిన వామనావతారం మాది కాదా !!!
గురుభక్తి లో మకుమేమే ఏకాలవ్యులం ,
దైవభక్తి లో . . .
ఆ త్రినేత్రుడికే చూపును ఇచ్చిన కన్నప్పలమే మేము కాదా ....
.......
యువకులం మేం యువకులం
ఆ ఉదయించే రవి కిరనాలం .................. .............
ఓ యువకుడి మనసున మాట .....
ఇది నా యదను దాగిన ఓ మాట ....
............................................. .................................. ...................... - ఓ సిద్ధార్థుడి కలం ...
SIddhartha CHOkkakula
No comments:
Post a Comment