Saturday, 7 January 2017

మనం చెరిచిన గంగ

కైలాసానికి కోడలు నీవై
మా కాలువ కలిసిన కలుషిత గంగై

నువ్వు కొండలు కోనలు లోయలు దాటితే
గొడ్లు ముడ్లు దొడ్లు కడుగుతాం

జలపాతం గా నువ్వు జారితే
జలకాలాటలో మేము తేలుతాం

మోక్షం కోసం నీలో మూలుగుతాం
మూత్రం కూడా నీలో కలుపుతాం

పుడమితో సాగే అనుబంధాన్ని
కంచలేసి మరి కొల్లగొట్టుతాం

విశ్వమంతా  నిండిన నిన్ను
విచ్చలవిడిగా వ్యభిచారిస్తాం

 - ఓ సిద్ధార్థుడి కలం
ఓ మిత్రుడి సహకారం తో రాసినది 

Sunday, 25 December 2016

raani manishiki karagani manasuki o lekha

"జన్మంతా నీ అడుగుల్లో వేసే వీలుంటే ఆ నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా "

అని రాసిన సిరివెన్నెల పాట లా 

నీవు అడుగులు వేసే నేల నేనౌతూ 
నీ చిరునవ్వుల కారణం నేనౌతూ 
నీ ఆనందానికి ఆధారం నేనై 

"ఓ పాపా లాలి" అని నేను కట్టిన ప్రపంచం లో 
నువ్వు రాణి గా ఉండే మన సామ్రాజ్యం లో 
నిన్ను నిద్రపుచ్చి నీ గుమ్మం బయట నిన్ను ఎల్లప్పుడూ 
కాపాడే రక్షకుడి గా ఉండాలని ఆశించి 

నా అను జీవితానికి మనం అనే అర్ధాన్ని అనుకున్నా 

కానీ పరమార్ధం అని దైవనిర్ణయపు బానిసనై 
అనర్ధాల అడ్డుగోడల మధ్య కొట్టుమిట్టాడుతూ 
నీకు నన్ను దూరం చేసిన ఆ విధిని చూసి వేధిస్తూ 
అంధకారపు అంచుల్లో ఒంటరినై నే కృషించగా 
నీవు రావు అన్న బాధ నన్ను దహించు వేళా 
నీ ఆనందమే నాకు ముఖ్యం అని 
ఆ బాధని దిగమ్రింగే నా ప్రయత్నం 
చేస్తే నన్ను మృగం దిక్కు తోచక 
నొప్పి దాగక బ్రహ్మరాత ను మార్చలేక 
క్షణక్షణం నరకవేదనై నన్ను అంతంతమాత్రం గా 
కొరికేస్తున్నా 

కన్నీరు ఆగక కూడా నీ ఆనందమే నాకు చాలు 
అంటూ నరకాన్ని సైతం నవ్వుతూ నడిపిస్తున్నా 

నేను వేచి ఉంటా నీ రాకకై 
 ఎందుకంటే 
నేను నిన్ను ప్రేమించటం కన్నా 
నీ పై నాకు ఉన్న అభిమానం అధికం 
అదే నిజం 

ఇట్లు 
ఓ బాటసారి 

Friday, 8 July 2016

joe

పెదవే కదలనీ చిరునవ్వొచ్చెనే 
యెదకే తెలిసేనే చెలి అది నీ వల్లనే 

నది లా పొంగె నా మది లొ ప్రేమనే 
ఎగిసే సంద్రమై సఖి నీలో కలిసెనే 

నీ శ్వాసే చిరుగాలై 
నీ చూపే చిరుజల్లై 
తనువంతా తడపగా ఓఓఓ 

పువ్వల్లే నే మారి 
నీ ముందే రాలానే 
కురులల్లో బంధీనై ఓఓఓ 

. 
.

.
.

చేతుల్లో చేయ్యే వేసి నడిచేద్దామిలా 
ఆ నింగే నేలను కలిసే దూరం వరకిలా 

మెరిసే ఆ మెరుపులు కాస్తా హరివిల్లవ్వవా 
రాలే ఆ చినుకులు నీ చెంపను తడపగా 

నీలి కళ్ళల్లోనా , కళలే కలలై ఉన్నా 
నా నీ ఇల లో నే నిజమై చూపనా 

నడిచిన నెలే సాక్షిగా 
నీతో జీవితమంతా 
తోడుంటా నీడలా 

నా ఈడు గా నువు నా జోడుగా 
కవికే కవితలా కాలంతో కదులుదాం 

క్షణమూ క్షణమూ నూ కలిపేస్తూ అలా 
యుగమే గడిచెలా నా సృష్టి నే ఎలవా 

Tuesday, 14 July 2015

ఓ రైతన్న వేదన

ధాన్యం  సిమెంటు లొ పండదు  సారు 

జవాబిచ్చాడు   రాముడు .

విషయం అర్ధమయ్యినా రాముడి మాటల్లో  ఉన్న బాధని , అయన బాధ వెనక ఉన్న అసలు కారణాన్ని గ్రహించి వింటూనే  ఉన్నాడు  భూస్వామి

ఆ చుట్తుపక్కల  ఉన్న పొలాలన్నింటినీ కొనెసాడు  భూస్వామి.

తరతరాలు కుర్చొని తిన్నా తరగని సంపద అతనిది.

లేచిందే ప్రయాణం అన్నట్టుగా సాగుద్ది భూస్వామి తీరు.

ఏదైనా మనసున పడటమే ఆలస్యం , తన పాదాలముందు ప్రత్యక్షం అవుతోంది…

ఎంత పెద్ద ఓడైనా, ఎంత గొప్ప ప్రస్థానమైనా, ఏదో ఒక రోజు ఒడ్డుకి చేరాల్సిందే.

బహుసా భూస్వామి ప్రస్థానానికి, అతనికున్న భూకమానికి ముగింపు పలికింది మన రాముడేనేమో!!

ఈ చుట్టుపక్కల భూములు అన్ని సొంతం చేసుకొని ఆ పంటనేలలలో ఒక townshippu కట్టాలని అతని కోరిక

కాకపోతే అన్ని పొలాలు కొనగాలిగాడు కానీ, ఆ 200 ఎకరాలు మధ్యలో ఉన్న రాముడి పోలం మాత్రం అడ్డుగా నిలిచింది.

పొలం పెద్దది ఏమి కాదు, సుమారు ఓ రెండు ఎకరాలు ఉంటుంది. అలాగే వదిలేస్తే ఆ రెండు ఎకరాలకోసం మరో రోడ్డు

వెయ్యాలి ప్రత్యేకంగా.

అది భూస్వామి కి మరింత తలనొప్పిని తెచ్చిపెట్టింది.

ఆ రెండు ఎకరాలకి బదులుగా మరో పదెకరాల భూమి ఇస్తాను అన్నాడు భూస్వామి.

ఒప్పలేదు రాముడు, వచ్చేది 100 ఎకరాలు అయిన ఎం లాభం ఆ రైతుకి, ఆ భూమి బంజరభూమి అయినప్పుడు.

ఇద్దరికి కావల్సింది ఒకటే నేల , ఆ నేల ఒకరికి కోట్లు ఇస్తే మరొకడికి కూడు పెడుతుంది.

ధనానికి ధాన్యానికి బేరం తెలట్లేదు అక్కడ

పంట కోసం ఒకడి పోరాటం, పైసలకోసం మరొకడి ఆరాటం

ఎం చెయ్యగలరు ఎవ్వరైనా ?

తన అనుచరలను ఎంత మందిని పంపినా రాముడు మాత్రం మౌనంగానే నిరాకరించాడు.

ఆఖరికి భూస్వామే దిగొచ్చి మాట్లాడాల్సి వచ్చింది.

“ ఏంటయ్యా రాముడు , ఏంటి ఇది ? చిన్న పిల్లాడిలా ఈ పంతం దేనికి ? నేనేమన్నా దౌర్జన్యం చేస్తున్నానా ?

ఒక్క మాట అడుగుతాను జవాబు ఇయ్యు , నీ దగ్గర భూమి తీసుకొవడం  ఎంత సేపు పని నాకు !

తీసుకోలేను అనుకుంటున్నావా ??

పోనిలే పేదవాడివి అని జాలితో భూమికున్న రేటు కంటి ఎక్కువే ఇస్తాను అంటే మారం చేస్తున్నావ్ ,

అంత పొగరు దేనికి ? ఎంతకాలం కుర్చున్తావ్ పట్టుదలతో ? ఇస్తున్న డబ్బులు సరిపోలేదు అంతే చెప్పు నీ పేరుమీద

ఒక ఫ్లాట్ కూడా రాస్తాను.

అలొచించుకొ ఇంతకు మించిన బేరం ఎవరు ఇవ్వగలరు నీకు !!

చాదస్తం తో కోరివచ్చిన అవకాశాన్ని వాడులోకోవద్దు ", చిరాకు పడుతూ బేరం మాట్లాడటానికి చూసాడు భూస్వామి.

దానికి రాముడు చిన్నగా నవ్వుతూ

“ అయ్యా ఈ పొలం పై నాది పంతం కాదు. ఈ నెల ఇచ్చే పంటే నాకు ప్రాణాధారం ! , చదువు రాని వాడిని, 

ఈ డబ్బులు ఈ ఫ్లాటులు నాకు అంతుపట్టవు

ఊహ ఎరిగినప్పటినుంచీ హలం పట్టి పొలం దున్నటమే నాకు ఎరుక .

ధనం గురించి గానీ కలం గురించి కానీ ఎమాత్రం అవగహన లెదు సారు.

నాకు ఒచ్చిందీ , నాకు తెలిసిందీ వ్యవసాయమే, వ్యాపారం కాదు.

మీరు ఇస్తానన్నారే ఏదో భూమి, దానితో నేనేం చేసుకోగలను ?

ఆఅ భూమి లో పంట పండిద్దా ? మొక్క మోలిసిద్దా ?

మీరు ఇస్తానన్న నోట్లు తడిస్తే నాని చిరిగిపోతాయి.

అదే నా నెల లో నాటిన విత్తనాలు తడిస్తే మురిసిపోయి మొక్కలవుతాయి !!

మీరు కట్టే మేడలు ఎంత ఎత్తు ఉండీ ఎం లాభం , ఎంత విశాలంగా ఉంది ఎం ప్రయోజనం? అందులో ఉండీ మనిషికి తిన్దినివ్వనప్పుడు. "

ప్రశ్న కి ప్రశ్న  తోనే సెలవిచ్చాడు రాముడు  ..

“ నేలను ఇవ్వను అంటావ్ మొత్తానికి ?"  విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోకుండా అసహనంగా అడిగాడు భూస్వామి .

“ ధాన్యం సిమెంట్ లో పండదు సారూ ", జవాబిచ్చాడు రాముడు.

లెగిసి తలపాగా తీసుకొని పశువులకి మేత వెయ్యటానికి పోయాడు రాముడు, ఎం జరగనట్టూ ..

ఆ మాటతో భూస్వామికి అసలు విషయం అర్ధమయ్యింది.

తనలొ తాను నవ్వుకుంటూ కారెక్కి వెళ్ళిపోయాడు అక్కడనుంచి  ..

ఇంటికి పోయినా కూడా భూస్వామికి రాముడి మాటలే వినిపిస్తున్నాయి

“ ధాన్యం సిమెంటులో పండదు సారూ "..

నిజమే కదా !!!!!!!

మనం ఎంత ఆధునిక యుగం లో ఉన్న , మనకి తిండి పండేది నెల మీదే కదా !!!!!!..

భవిష్యత్తు లొ ఎదైనా కొత్త పద్దతులు వస్తే , అదీ గోడలమీద లేక మనం వాడి పడేసిన ప్లాస్టిక్కు మీద పంటలు పండితే

ఆ తిండి తిని మనం అవలక్షనాలు లెకుండా  బతికితే. అప్పడు కడదామా పంట భూముల్లో పట్టణాలు?!.

డబ్బుతో ఏదైనా వస్తుంది అన్నట్టు వ్యవహారిస్తే

అతి త్వరలో మన ఆస్తి మొత్తం పోగేసినా మెతుకు అన్నం కూడా దక్కని పరిస్థితి ఒస్తుంది  ..

కొనసాగిద్దామా ఇలాగే

రైతన్న వ్యవసాయం మరిచిపోయేలా చేయొద్దు , మన తరువాత తరాల వారి ఆకలి కేకల కారణం గ మారొద్దు ..

… ఓ రైతు బిడ్డ ఆవేదన ...........  

...............    ................. .................. ................... ..................... .......  ఓ సిద్ధార్థుడి కలం

Friday, 5 June 2015

ఓ యువకుడి మనసున మాట

యువకులం మేం యువకులం ,
నింగిని నేలకు కలిపే మెరుపులం
      వెలుతురు కన్నా వేగం ,
      మా ఆశల ఊహల పయనం
ఆ సంద్రం కన్నా లోతైనది,
ప్రేమతో నిండిన మా మది
      ఆ అలల సవ్వడి లా,
      ఆ కోయిల గానం లా ,
వికసించే పుష్పం లా ,
విహరించే పక్షి లా ,
      నిత్యం ప్రతినిత్యం,
      ఉరకలు వేసే మా యవ్వనం
కవచం వదిలిన కర్ణులం ,
రాజ్యం వదిలిన రామచంద్రులం ,
     వారధి కట్టిన వానరులం ,
     మేం లంకను కాల్చిన పవనపుత్రులం ,
కోపంలో మేం పరశురాములం,
గాంభీర్యం లో దుర్యోధనులం
      భూమిని సైతం హలముతో చీల్చే బలరాములం మేము కాదా ?
     కొండను సైతం చిటికినవేలితో గాలికి లేపిన ఆ కృష్ణావతారం మది కాదా ?
ఆకాశానికి నిచ్చెన వేసిన ఆ అర్జునులం మేమే
ఐరవతమును నెలకు తెచ్చిన ఆ భీముని బలమూ మాది కాదా ?
     ఆ కాలయముడు నే  తిప్పికొట్టినా  మర్ఖండేయులం మేమే కాదా ?
     ఆ మహాబలుడనే  నెలకు తొక్కిన  వామనావతారం మాది కాదా !!!
గురుభక్తి లో మకుమేమే ఏకాలవ్యులం ,
దైవభక్తి లో . . .
ఆ త్రినేత్రుడికే  చూపును ఇచ్చిన కన్నప్పలమే మేము కాదా ....
.......
యువకులం మేం యువకులం
ఆ ఉదయించే రవి కిరనాలం .................. .............

         
   ఓ  యువకుడి మనసున మాట .....
  ఇది నా యదను దాగిన ఓ మాట ....
............................................. .................................. ......................  - ఓ సిద్ధార్థుడి కలం ...
                                                                                                            SIddhartha CHOkkakula

Monday, 5 January 2015

లేదు

               ఉండనీ  లోకం ఎంత పెద్దదైనా
                            ఉన్నారా మనకంటూ ఎవరైనా

              జరగనీ ఎంత విషాదమైన
                          కదిలిందా మన మనసు ఎప్పుడైనా
             
               ఓడనీ ఈ పోరాటంలో ఎన్నిసార్లైన
                         ఆపామా మన ప్రయత్నం ఎప్పుడైనా

              వెయ్యనీ నిందలు ఎన్నైనా
                             తెలియకుండా  ఆగిందా నిజం ఎన్నడైనా

                ఎదగనీ  ఆ చెట్టు ఎంత పెద్దదైనా
                          వదిలింద నేలను ఒక్క క్షణమైనా

              ఎగరనీ గాలిపటం ఎంత ఎత్తు ఎగిరినా
                         నిలిచిందా తీగని వదిలి ఒక్క గడియ అయినా

               కలగనీ నొప్పి ఎంత కలిగినా
                        వదిలిందా తల్లి కాన్పుని ఎక్కడైనా

                రాలనీ కన్నీళ్ళు ఎంత రాలినా
                       ఆలసిండా  అ కన్ను ఎంత ఏడ్చినా

               ఉండనీ  కంఠం లో విషం ఎంత ఉన్నా
                      మింగినాడే తప్ప దిక్కరించాడా పరమసివుడైనా

              మండనీ అ అగ్ని ఎంత మండినా
                     ఆగిందా ఆ భానుడి తనువు  ఎన్నడైనా

               అడ్డు రానీ ఎన్ని కొండలైనా ఎన్ని లోయలైనా
                           వదిలిందా  ఆ నది సంద్రాన్ని ఎక్కడైనా

                ఎదగానీ మనిషి ఎంత పెద్దవాడైనా
                           జయించాడ చావు ని  ఎక్కడైనా

                ఉండనీ  సామాజిక  బేధాలు ఎన్ని ఉన్నా
                           ఆపగాల్గిందా అ మనిషి స్వార్ధాన్ని ఎంత సాదిన్చినా

               జరగనీ ఆ మూడో ప్రపంచ యుద్ధమైనా
                         మారుతాడ మనిషి అప్పుడైనా

                   రాయనీ ఆ మనసు ఎంత రాసినా
                         ఆగిందా అ కలం నీరసించినా

                 చదివినా న రచనలు ఎవ్వరు చదవక మరచినా
                       వదులుతానా నా  ప్రపంచమైన మీ అనుబంధాన్ని ఎప్పుడైనా

లేదు  ఇదీ న జవాబు ఈ ప్రశ్నకైనా
.................................................. .................................................. ........... సిధార్థ చొక్కాకుల 

Thursday, 25 September 2014

FREE SOULS

While we sat there in the park enjoying the calmness of the pleasant sunset of the evening …..
         he’s there sitting by the rocks all alone looking forward for a brighter tomorrow,
                  he awaited the rise of the sun That awakens our empty souls……………..
Image
while every one of us are busy singing the songs of the heroes spoken

     He’s the one fighting there, for keeping their legacy alive so that
            generations coming will know that their spirits are here to fight for their souls …….Image

while everyone out there are involved in taming and getting tamed unaware of..
there he was free from society , spirits free to fly, being an independent soul
    while we are all busy at yelling at others well being and striving for selfless selfish comforts
         there was him laying his life for his own selfish dream where and individual can be what he wanted inspite of running blinded behind the materialistic happiness of the world so called
he was there breaking a stereotype of defined happiness
he was there dreaming of a future…
he was there sitting on the rocks watching everyone of us
he is there, and he will be
in each and everyone of us..
just and just only because he was there LIVING HIS LIFE…. Image

individual spirits are them and for all those who are
my respect here for you ………………………………………………………..Image……………………………………………………   SiCho